డ్రోన్లు, ఈవీల నాణ్యత ప్రమాణాల రూపకల్పనకు కృషి: పీయూష్ గోయల్!

డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కోసం తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

Update: 2023-05-03 17:03 GMT

న్యూఢిల్లీ: డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కోసం తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దానివల్ల నాణ్యత లేని ఉత్పత్తుల దిగుమతులను కట్టడి చేయడం, దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఉంటాయి. అంతేకాకుండా ఈవీల ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ల(క్యూసీఓ) అభివృద్ధి కోసం కూడా పనులు జరుగుతున్నాయని బుధవారం ప్రకటనలో పీయూష్ గోయల్ వెల్లడించారు.

వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్‌ల అభివృద్ధి జరిగింది. ప్రస్తుతం స్టాండర్డ్స్ ఫర్ అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికల్(యూఏవీ)ని సాధారణ అవసరాలకు, సైబర్ సెక్యూరిటీ పరిరక్షణకు ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. పరిశ్రమల వర్గాలతో సమగ్రంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే నాణ్యత ప్రమాణాలను రూపొందించాం. బ్యాటరీలకు సంబంధించి వివిధ ప్రమాణాలు అభివృద్ధి చెందాయని, బ్యాటరీ స్వాపింగ్ ప్రమాణాలపై కృషి చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ పేర్కొన్నారు.

Tags:    

Similar News