ఒలింపిక్స్‌ స్టార్ట్ అయ్యే టైంలో 70% విమానాలను రద్దు చేసిన ఫ్రెంచ్ ఎయిర్‌లైన్స్

పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె కారణంగా పారిస్ ఓర్లీ విమానాశ్రయంలో శని, ఆదివారాల్లో 70 శాతం విమానాలను రద్దు చేయాలని ఫ్రెంచ్ పౌర విమానయాన అథారిటీ విమానయాన సంస్థలను తాజాగా ఆదేశించింది

Update: 2024-05-25 07:49 GMT

దిశ, బిజినెస్ బ్యూరో:పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె కారణంగా పారిస్ ఓర్లీ విమానాశ్రయంలో శని, ఆదివారాల్లో 70 శాతం విమానాలను రద్దు చేయాలని ఫ్రెంచ్ పౌర విమానయాన అథారిటీ విమానయాన సంస్థలను తాజాగా ఆదేశించింది. ఈ నెల ప్రారంభంలో కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమ్మె చేయగా, ఇప్పుడు రెండో సారి చేస్తున్నారు. అయితే జులై 26న పారిస్ ఒలింపిక్స్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు ఆటగాళ్లు, అతిధులు, పర్యాటకులతో రద్దీగా ఉంటాయి. ఫ్రాన్స్‌లోని రెండవ అత్యంత రద్దీగా ఉండే ఓర్లీ విమానాశ్రయం ద్వారా ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ఇలాంటి సమయంలో 70 శాతం విమానాలను రద్దు చేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ రద్దు ప్రభావం శనివారం 4:00 నుండి ఆదివారం చివరి వరకు ఉంటుంది.

విమానాశ్రయ అధికారులు, ప్రధాన యూనియన్ SNCTA మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మెను ప్రభుత్వం ఖండించింది. పారిస్‌కు దక్షిణంగా ఉన్న ఓర్లీ, రోయిసీ చార్లెస్-డి-గౌల్ తర్వాత రాజధానికి రెండవ అతిపెద్ద విమానాశ్రయం. ఇది గత సంవత్సరం 32 మిలియన్లకు పైగా ప్రయాణికులను తీసుకువెళ్లింది. సమ్మె కారణంగా ఓర్లీ, ఫ్రెంచ్ విదేశీ భూభాగాల మధ్య విమానాలు మాత్రమే ఈ వారాంతంలో సాధారణంగా పనిచేస్తాయని DGAC తెలిపింది.

Similar News