సీజన్ ముగింపు నాటికి 82 లక్షలకు పైగా Fashion, Lifestyle ఉత్పత్తుల అమ్మకాలు: Flipkart

ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆరు రోజుల సీజన్ ముగింపు నాటికి 82 లక్షలకు పైగా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను విక్రయించినట్లు తెలిపింది.

Update: 2022-12-23 03:31 GMT

బెంగళూరు: ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆరు రోజుల సీజన్ ముగింపు నాటికి 82 లక్షలకు పైగా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను విక్రయించినట్లు తెలిపింది. ఇటీవల డిసెంబర్ 7-12 వరకు జరిగిన సీజన్ సేల్‌లో న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, గుర్గావ్ ముంబై, పూణే, చెన్నై, లక్నో, గుహవతి నగరాల నుంచి వినియోగదారులు అధికంగా షాపింగ్ చేశారు. సేల్ ప్రారంభమైన నాటి నుంచి ప్రతి నిమిషానికి 14 కంటే ఎక్కువ ఆర్డర్‌లు వచ్చాయి. అలాగే ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల కోసం 25-35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఎక్కువగా ఈ సేల్‌లో పాల్గోన్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ సీనియర్ డైరెక్టర్ అభిషేక్ మాలూ మాట్లాడుతూ, ప్రస్తుతం పెళ్లిల సీజన్ మొదలవడం వలన సరికొత్త చీరలు, జ్యువెలరీ సెట్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, లెహంగాలు, పురుషుల బ్లేజర్‌లు, సూట్‌లకు డిమాండ్‌ పెరిగింది. మొత్తం వినియోగదారుల నుంచి 38,000 పైగా కాక్‌టెయిల్ డ్రెస్ ఆర్డర్‌లను అందుకుంది. ఈ సేల్‌లో 2 లక్షలకు పైగా అమ్మకందారులు తమ ప్రొడక్ట్స్‌లను అమ్మకానికి ఉంచారు. పెద్ద నగరాలతో పాటు, టైర్ 3 పట్టణాల నుంచి కూడా డిమాండ్ పెరిగినట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News