BuzzFeed to cut 12% of its workforce : ఉద్యోగుల తొలగింపు బాటలో బజ్‌ఫీడ్

డిజిటల్ మీడియా కంపెనీ బజ్‌ఫీడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులలో 12 శాతం లేదా దాదాపు 180 మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించనుంది

Update: 2022-12-07 03:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ మీడియా కంపెనీ బజ్‌ఫీడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులలో 12 శాతం లేదా దాదాపు 180 మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించనుంది. ఈ విషయాన్ని బజ్‌ఫీడ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సవాళ్లు, ఇన్‌పుట్ ఖర్చులు మొదలగు కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ''2023లో బజ్‌ఫీడ్ విస్తరణ ప్రణాళికలు కలిగి ఉంది. ఆర్థిక మాంద్యం ఎదుర్కోవాలంటే, ఖర్చులు తగ్గించి, అత్యుత్తమ సేవలు అందించే విభాగంలో పెట్టుబడులు పెంచాల్సి ఉందని'' కంపెనీ CEO జోనా పెరెట్టి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ తొలగింపులు ఎక్కువగా సేల్స్, ప్రొడక్షన్, టెక్, కంటెంట్ విభాగాల్లో ఉంటాయి. ఇంకా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం చివరి నాటికి చాలా ఉద్యోగాలను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. దీనికి సంబంధించిన ముందస్తు ప్రణాళికను కూడా సిద్ధం చేయనుంది.

Similar News