‘ఉన్నత నైపుణ్యాలు ఉన్నవారికే కేరీర్‌లో ఎదిగే అవకాశం’

నైపుణ్యం అనేది ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరడానికి ఉపయోగపడుతుంది.

Update: 2024-05-23 08:34 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: నైపుణ్యం అనేది ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరడానికి ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు జరుగుతున్న క్రమంలో చాలా మంది ఉన్నత నైపుణ్యాలు నేర్చుకున్న తర్వాత తమ ఉద్యోగాల్లో మార్పును కోరుకుంటున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. దాదాపు 85 శాతం మంది కూడా ఇదే భావనతో ఉన్నట్లు Simplelarn 2024 స్టేట్ ఆఫ్ అప్‌స్కిల్లింగ్ కన్స్యూమర్ సర్వే తెలిపింది. నివేదిక ప్రకారం, 2023తో పోలిస్తే ప్రస్తుతం 2024లో అభ్యర్థుల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. దాదాపు 65 శాతం మంది పార్ట్- టైం లేదా ఆన్‌లైన్ ధృవీకరణలను ఎంచుకుంటున్నారు. ఇది గత ఏడాది కంటే 51 శాతం ఎక్కువ. 97 శాతం మంది మెరుగైన కెరీర్ అవకాశాలను అందుకోవడానికి నైపుణ్యం అనేది ఒక ముఖ్యమైన అంశంగా విశ్వసిస్తున్నారు.

65 శాతం మంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోడానికి ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సదుపాయం కొత్త నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. 45 శాతం మంది తమ కంపెనీలలో లేదా కోరుకున్న రంగాల్లో అవకాశాలను పెంచుకోవడానికి నైపుణ్యం సహాయపడుతుందని భావిస్తున్నారు. డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, DevOps, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రతివాదులలో ఎక్కువగా కోరుకునే నైపుణ్యాలుగా ఉద్భవించాయి.

కంపెనీలు కూడా కొత్త నైపుణ్యాలు లేని వారిని ముందుగా తొలగించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సర్వేలో తేలింది. ఐటీ పరిశ్రమ డైనమిక్, ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది. నిపుణులు భవిష్యత్తు కోసం నైపుణ్యాన్ని పెంచుకోవడం అత్యవసరం సింప్లిలేర్న్ సహ వ్యవస్థాపకుడు కశ్యప్ దలాల్ అన్నారు

Similar News