అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా హెడ్‌ పునీత్ రాజీనామా!

అమెజాన్‌కు చెందిన క్లౌడ్ విభాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) ఇండియా, సౌత్ ఏషియా హెడ్ పునీత్ చందోక్ తన బాధ్యతలకు రాజీనామా చేసినట్లు కంపెనీ శుక్రవారం ప్రకటనలో తెలిపింది

Update: 2023-06-02 11:25 GMT

న్యూఢిల్లీ: అమెజాన్‌కు చెందిన క్లౌడ్ విభాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) ఇండియా, సౌత్ ఏషియా హెడ్ పునీత్ చందోక్ తన బాధ్యతలకు రాజీనామా చేసినట్లు కంపెనీ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఆయన స్థానంలో కంపెనీ మిడ్-మార్కెట్, ఎంటర్‌ప్రైజెస్, గ్లోబల్ బిజినెస్ హెడ్ వైశాలి కస్తూరి తాత్కాలికంగా బాధ్యతలను తీసుకుంటారని పేర్కొంది.

2030 నాటికి దేశంలో సుమారు రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడులను కంపెనీ ప్రకటించిన రెండు వారాల వ్యవధిలో పునీత్ చందోక్ బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. ఆసియాలోనే క్లౌడ్ కంప్యూటింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ గతంలో ప్రకటించిన పెట్టుబడులను రెట్టింపు చేసింది.

అయితే, ఆయన రాజీనామాకు కారణాల గురించి కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. కాగా, పునీత్ చందోక్ 2019లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో చేరారు. కంపెనీలోని ఉన్నతాధికారులకు కూడా పునీత్ రాజీనామా విషయం ఆలస్యంగా తెలిసిందని, ఆయన మరో సంస్థలో చేరే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read..

Work From Home పై కీలక నిర్ణయం తీసుకున్న మెటా! 

Tags:    

Similar News