పసిడి ప్రియులకు అలర్ట్.. తులం బంగారం ధర ఎంత ఉందంటే?

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Update: 2024-05-26 05:33 GMT

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతూ కొనుగోలు దారులను టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా నేడు పసిడి ధరలు స్థిరంగా ఉండి కొనుగోలు దారులకు కాస్త ఊరటనిచ్చాయి.

నిన్నటి రేట్లతోనే కొనసాగుతుండటంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కిలో వెండి ధర విషయానికొస్తే.. రూ. 96,000గా ఉంది. అయితే ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 400

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,440

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 400

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,440

Similar News