బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి చేరనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్..?

అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి చేరే అవకాశం ఉందని తెలుస్తుంది.

Update: 2024-05-23 10:20 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయాన్ని IIFL ఆల్టర్నేటివ్ రీసెర్చ్ పేర్కొంది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ విప్రో స్థానంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ సూచీలోకి చోటు దక్కించుకునే చాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ ఇండెక్స్‌‌లోకి దాదాపు రూ.1,000 కోట్ల ఫండ్స్ రావచ్చిన సూచించింది. ఇదే సమయంలో విప్రోను మినహాయించడం వల్ల దాదాపు రూ. 500 కోట్ల మేర బయటకు వెళ్లే అవకాశం ఉందని IIFL అంచనా వేసింది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) తన సెమీ-వార్షిక ఇండెక్స్ రీకాన్ఫిగరేషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌(ఏఈఎల్)ను సెన్సెక్స్‌ సూచిలోకి చేర్చినట్లయితే, గౌతమ్ అదానీ నేతృత్వంలో ఏఈఎల్ మొదటిసారిగా సూచిలోకి చేరినట్లుగా గుర్తింపు పొందుతుంది. గతంలో 2023లో కూడా ఈ కంపెనీ సూచీలోకి చేరుతుందని అంచనా వేశారు. అయితే హిండెన్‌బర్గ్ రీసెర్జ్ ఆరోపణలతో దీనికి బ్రేక్ పడింది. ఇటీవల అదానీ పై ఉన్న ఆరోపణలు తొలగిపోవడంతో గ్రూపుకు చెందిన షేర్లు బాగా రాణిస్తున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ కొత్త ఎనర్జీ నుండి విమానాశ్రయాలు, డేటా సెంటర్‌ వ్యాపారాలను నిర్వహిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాల కోసం కంపెనీ రూ.80,000 కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గతంలో తెలిపా

Similar News