రాష్ట్రంలో నేడు న్యాయవాదుల విధుల బహిష్కరణ.. మంథని బంద్
దిశ, వెబ్‌డెస్క్ : హైకోర్టు అడ్వకేట్ వామనరావు, నాగమణి దంపతుల మర్డర్‌కు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నల్ల బాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మంథని బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. అడ్వకేట్ దంపతులను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మంథని బంద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నాడు. ముందుగా ప్రభుత్వ ఆస్పత్రిలో వామన్ రావు దంపతులకు నివాళి అర్పించి, బంద్‌లో పాల్గొననున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : హైకోర్టు అడ్వకేట్ వామనరావు, నాగమణి దంపతుల మర్డర్‌కు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నల్ల బాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మంథని బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. అడ్వకేట్ దంపతులను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మంథని బంద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నాడు. ముందుగా ప్రభుత్వ ఆస్పత్రిలో వామన్ రావు దంపతులకు నివాళి అర్పించి, బంద్‌లో పాల్గొననున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు.