రామమందిరం కోసం గౌతమ్ గంభీర్ రూ. కోటి విరాళం

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అయోధ్య రామ మందిరం కోసం భారీ విరాళం ఇచ్చారు. రూ. కోటి రూపాయలు తన వంతు సాయంగా ఆలయ నిర్మాణానికి ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన రామమందిరం భారతీయులందిరికీ కల అన్నారు. సుదీర్ఘమైన కల నేడు నెరవేరిందని గుర్తు చేసిన గంభీర్.. ఆలయ నిర్మాణం కోసం అందరూ ఏకం కావాలన్నారు. అందుకే తన కుటుంబం తరఫున ఆలయ […]

Update: 2021-01-21 07:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అయోధ్య రామ మందిరం కోసం భారీ విరాళం ఇచ్చారు. రూ. కోటి రూపాయలు తన వంతు సాయంగా ఆలయ నిర్మాణానికి ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన రామమందిరం భారతీయులందిరికీ కల అన్నారు. సుదీర్ఘమైన కల నేడు నెరవేరిందని గుర్తు చేసిన గంభీర్.. ఆలయ నిర్మాణం కోసం అందరూ ఏకం కావాలన్నారు. అందుకే తన కుటుంబం తరఫున ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహకారం అందించినట్టు గంభీర్ చెప్పుకొచ్చారు. కాగా, ఆలయం నిర్మాణం కోసం దేశ ప్రధాని సహా, పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో దేశ వ్యాప్తంగా ఆలయ నిర్మాణం కోసం నిధి సేకరణ కొనసాగుతూనే ఉంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News