పాలకులు విఫలమయ్యారు: శ్యామ్ సుందర్‌రావు

దిశ, భువనగిరి: పోచంపల్లి మండలం ఖప్రాయపల్లి-ముక్తాపూర్ మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని యాదాద్రి-భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పి.వి.శ్యామ్ సుందర్ రావుఅన్నారు. మంగళవారం భువనగిరి నియోజకవర్గంలోని ఖప్రాయపల్లి-ముక్తాపూర్ మట్టి రోడ్డును పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మట్టి రోడ్లు దర్శనమిస్తున్నప్పటికి పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. నియోజక వర్గంలో పలు గ్రామాలలో రోడ్లు గుంత గుంతలుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఈ రోడ్ల వెంట స్థానిక […]

Update: 2020-07-28 04:19 GMT

దిశ, భువనగిరి: పోచంపల్లి మండలం ఖప్రాయపల్లి-ముక్తాపూర్ మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని యాదాద్రి-భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పి.వి.శ్యామ్ సుందర్ రావుఅన్నారు. మంగళవారం భువనగిరి నియోజకవర్గంలోని ఖప్రాయపల్లి-ముక్తాపూర్ మట్టి రోడ్డును పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మట్టి రోడ్లు దర్శనమిస్తున్నప్పటికి పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.

నియోజక వర్గంలో పలు గ్రామాలలో రోడ్లు గుంత గుంతలుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఈ రోడ్ల వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్యెల్యే వెంట ప్రయాణిస్తున్నా రోడ్ల పరిస్థితి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పక్కా రోడ్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు.

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టే అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్ప టికైనా పాలకులు స్పందించి గుంతలతో ప్రమాదకరంగా ఉన్న మట్టి రోడ్లను పక్కా రోడ్లుగా మార్చాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News