మంత్రి హరీశ్‌రావుకు డీకే అరుణ సవాల్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు బీజేపీ నాయకురాలు డీకే అరుణ సవాల్ విసిరారు. కేంద్రం నిధులపై సీఎం కేసీఆర్‌తో చర్చకు బండి సంజయ్ వస్తారని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చేస్తుందని బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను నిన్న దుబ్బాకలో హరీశ్‌రావు ఖండించారు. చర్చకు రావాలని సవాల్ విసిరారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన డీకే అరుణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నిధులపై కేసీఆర్‌తో చర్చకు బండి సంజయ్ సిద్ధమేనని […]

Update: 2020-10-20 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు బీజేపీ నాయకురాలు డీకే అరుణ సవాల్ విసిరారు. కేంద్రం నిధులపై సీఎం కేసీఆర్‌తో చర్చకు బండి సంజయ్ వస్తారని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చేస్తుందని బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను నిన్న దుబ్బాకలో హరీశ్‌రావు ఖండించారు. చర్చకు రావాలని సవాల్ విసిరారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన డీకే అరుణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నిధులపై కేసీఆర్‌తో చర్చకు బండి సంజయ్ సిద్ధమేనని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ఆర్థికమంత్రికి స్పష్టత లేకపోవడం సిగ్గుచేటన్నారు. హరీశ్‌రావు తన పేరును.. అరిచే రావుగా మార్చుకోవాలని విమర్శించారు.

చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపి టికెట్ ఇప్పించింది హరీశ్‌రావేనని ఆరోపించారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల మీ కుటుంబం చేతిలో ఉంటే దుబ్బాక గెలవాలని ఎక్కడైనా రాసి ఉందా? అని ప్రశ్నించారు. అధికారం, డబ్బు బలంతో టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందని, ఓటమి భయంతోనే హరీశ్‌రావు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో బీజేపీ కార్యకర్తల జోలికొస్తే టీఆర్ఎస్ అంతు చూస్తామని డీకే అరుణ హెచ్చరించారు.

Tags:    

Similar News