మహబూబ్ నగర్ లో ధర్నా.. బోర్ల కోసం…

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో పవర్ బోర్లను తొలగింపు విషయంలో అధికారులు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మున్సిపాలిటీ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఆంజయ, రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం మిషన్ భగీరథ నీరు అందిస్తున్న నేపథ్యంలో పట్టణంలో ఉన్న పవర్ బోర్ల తొలగింపు నిర్ణయం సరైనది కాదన్నారు. ఉన్న పవర్ బోర్లను స్టాండ్ బై గా ఉంచాలని వారు కోరారు. […]

Update: 2020-08-04 01:41 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో పవర్ బోర్లను తొలగింపు విషయంలో అధికారులు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మున్సిపాలిటీ ఆవరణలో ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఆంజయ, రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం మిషన్ భగీరథ నీరు అందిస్తున్న నేపథ్యంలో పట్టణంలో ఉన్న పవర్ బోర్ల తొలగింపు నిర్ణయం సరైనది కాదన్నారు. ఉన్న పవర్ బోర్లను స్టాండ్ బై గా ఉంచాలని వారు కోరారు. ప్రజలకు అవసరమైన సమయంలో వాటి ద్వారా నీరు వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏళ్ళ తరబడి ప్రజలు దహార్తిని తీర్చిన పవర్ బోర్లను ఇలా తొలగించడం సరికదన్నారు.

Tags:    

Similar News