Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కప్పు కొట్టుకునే ఇక్కడి నుంచి వెళ్తా అంటూ.. శపథం చేసిన అమర్ దీప్

శివాజీ, ప్రశాంత్‌ల ముందు తల ఎగరేస్తే పని కాదనే విషయం అతనికి తెలిసిపోయింది.

Update: 2023-10-18 06:58 GMT

దిశ,వెబ్ డెస్క్: అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక  చాలా మారిపోయాడు. శివాజీ, ప్రశాంత్‌ల ముందు తల ఎగరేస్తే పని కాదనే విషయం అతనికి తెలిసిపోయింది. హోస్ట్ నాగార్జున కూడా.. ప్రతి వారం అమర్ దీప్‌ ని ఏదొక వంక పెట్టుకుని తిడుతూ ఉండే వాళ్లు. అందుకే ఇప్పుడు అమర్ తన స్ట్రాటజీ మార్చుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే.. పల్లవి ప్రశాంత్‌ని జీరో నుంచి హీరోని చేసింది కూడా అమర్ దీపే. ఆ రైతు బిడ్డ ఇష్యూ లేపి.. ప్రశాంత్ ని హీరో చేసి తను మాత్రం విలన్ అయ్యాడు. అయితే ఈవారం నామినేషన్స్‌ సమయంలో అమర్ దీప్‌లో కొత్త మార్పు కనిపించింది. శివాజీ ఎప్పటిలాగే అమర్ దీప్‌ని నామినేట్ చేసినా కూడా.. ఒక్కమాట కూడా మాట్లాడకుండా నవ్వుతూ ఉండిపోయాడు.

ఆ తరువాత అశ్విని అమర్ దీప్ ని నామినేట్ చేసింది. అమ్మా.. నువ్వు ‘నామినేట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించు అశ్వినీ.. కుండపెట్టి కొట్టే ముందు ఆలోచించు కొట్టు.. కానీ ఒక్కమాట గుర్తించుకో.. నువ్వు కొట్టినా కొట్టకపోయినా.. నన్ను ఇక్కడ నుంచి పంపించడం అంత ఈజీ కాదు.. పోతే నేనే పోతా.. ఇక్కడ నుంచి మాత్రం పోను..వెళ్లే ముందు కప్పుకొట్టుకునే పోతా.. ఇది మాత్రం ఫిక్స్’ అంటూ చాలా స్ట్రాంగ్ గా అమర్ దీప్ చెప్పాడు. 

Tags:    

Similar News