MLC వెంకట్రామిరెడ్డికి బిగ్ షాక్.. ఆ విషయంలో హైకోర్టు సీరియస్

దిశ, డైనమిక్ బ్యూరో : ఇటీవలే సిద్దిపేట కలెక్టర్.. తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విత్తన డీలర్లతో జరిపిన సమావేశంలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వరి విత్తనాలు వేయవద్దని.. కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చినా పట్టించుకోమని డీలర్లను ఆదేశించారు. దీనిపై […]

Update: 2021-11-23 02:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఇటీవలే సిద్దిపేట కలెక్టర్.. తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

విత్తన డీలర్లతో జరిపిన సమావేశంలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వరి విత్తనాలు వేయవద్దని.. కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చినా పట్టించుకోమని డీలర్లను ఆదేశించారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని వెంకట్రామిరెడ్డిని ఆదేశించగా.. ఆయనతో క్షమాపణ చెప్పిస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 

Tags:    

Similar News