టీడీపీకి మరో బిగ్ షాక్.. రంగారెడ్డి కీలక నేత జంప్

దిశ, వికారాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌ సభ్యత్వం తీసుకున్న విషయం మరువకముందే, మరో కీలక నేత షాక్ ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం రామకృష్ణ పార్టీకి రాజీనామా చేస్తూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రాజీనామా పత్రాన్ని పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీని వీడాల్సి వస్తోందని, ఎల్ రమణతో కలిసి టీఆర్ఎస్ […]

Update: 2021-07-15 09:11 GMT

దిశ, వికారాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌ సభ్యత్వం తీసుకున్న విషయం మరువకముందే, మరో కీలక నేత షాక్ ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం రామకృష్ణ పార్టీకి రాజీనామా చేస్తూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రాజీనామా పత్రాన్ని పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీని వీడాల్సి వస్తోందని, ఎల్ రమణతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు పేర్కొన్నారు. కరణం రామకృష్ణ మోమిన్‌పేట మండలం కొత్త కొల్కొంద స్వగ్రామం కాగా.. టీడీపీ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎదిగారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందు ఉండడంతో పాటు టీడీపీ పార్టీలో చురుకైనా యువనాయకుడిగా గుర్తింపు పొందాడు. తెలంగాణలో టీడీపీ ప్రభావం ఎక్కువ ఉండకపోవడంతో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News