బిగ్ బాస్ 4 విజేత అతడే

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్-4 విజేత ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అఖిల్, అభిజిత్, సోహైల్, అరియానా, హారికలలో విజయం ఎవరిని వరిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు విజేత ఎవరో బిగ్ బాస్ ప్రకటించేశారు. బిగ్ బాస్-4 విజేత అభిజిత్ అంటూ కింగ్ నాగార్జున ఆదివారం ప్రకటించారు. దీంతో అభిజిత్ అభిమానులు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాగా మరో పార్టిసిపెంట్ అఖిల్ రెండో స్థానంలో నిలిచారు. రెండో స్థానం కోసం అఖిల్, సోహెల్ […]

Update: 2020-12-20 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్-4 విజేత ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అఖిల్, అభిజిత్, సోహైల్, అరియానా, హారికలలో విజయం ఎవరిని వరిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు విజేత ఎవరో బిగ్ బాస్ ప్రకటించేశారు. బిగ్ బాస్-4 విజేత అభిజిత్ అంటూ కింగ్ నాగార్జున ఆదివారం ప్రకటించారు. దీంతో అభిజిత్ అభిమానులు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాగా మరో పార్టిసిపెంట్ అఖిల్ రెండో స్థానంలో నిలిచారు. రెండో స్థానం కోసం అఖిల్, సోహెల్ మధ్య పోటి నెలకొంది. కానీ సోహెల్ రూ. 25లక్షలు తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతను మూడో స్థానంలో నిలిచాడు. ఇక అరియానా, హారికలు నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు.

Tags:    

Similar News