భార్య టార్చర్ తట్టుకోలేనంటూ డీఐజీకి లేఖ

దిశ, వెబ్‌డెస్క్ : సార్ నా బావమరిది పెళ్లికి వెళ్లాలి. లీవ్ ఇవ్వండి లేదంటే నా భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేనంటూ ఓ భార్య బాధితుడు లేఖ రాసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన దిలీప్ కుమార్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబర్ 11న తన బావమరిది పెళ్లి ఉందని, 5రోజుల సెలవు కావాలంటూ భోపాల్ డీఐజీ ఇర్షాద్ వలీకి లేఖ రాశారు. ఆ లేఖలో సార్ నాకు దయచేసి లీవ్ […]

Update: 2020-12-11 01:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సార్ నా బావమరిది పెళ్లికి వెళ్లాలి. లీవ్ ఇవ్వండి లేదంటే నా భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేనంటూ ఓ భార్య బాధితుడు లేఖ రాసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన దిలీప్ కుమార్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబర్ 11న తన బావమరిది పెళ్లి ఉందని, 5రోజుల సెలవు కావాలంటూ భోపాల్ డీఐజీ ఇర్షాద్ వలీకి లేఖ రాశారు. ఆ లేఖలో సార్ నాకు దయచేసి లీవ్ ఇవ్వండి. నాబావమరిది పెళ్లికి వెళ్లాలి. లేదంటే నా భార్య పెట్టే టార్చర్ భరించలేను. ఇవ్వటం కుదరదని మాత్రం చెప్పొద్దు..నా బాధ అర్థం చేసుకోవాలని కోరారు. లేఖ చివరిలో బావమరిది వివాహానికి హాజరుకాకపోతే జరిగే అనర్థాల గురించి తన భార్య ఇప్పటికే హెచ్చరించిందని కోట్ చేయడం సోషల్ మీడియాలో ఫన్నీగా మారింది.

అయితే కానిస్టేబుల్ దిలీప్‌కు లీవ్ ఇవ్వాల్సిన అధికారులే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిసిప్లినరీ యాక్షన్ కింద కానిస్టేబుల్ ను ట్రాఫిక్ విభాగానికి అటాచ్ చేస్తూ అడిషనల్ డీజీపీ నోటీసులు జారీ చేశారు. లీవ్ కావాలని అధికారులకు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారని, అందుకే అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News