కొడిమ్యాల పంచాయతీ ఆవరణలో బీరు బాటిళ్లు..

దిశ, కొడిమ్యాల : మందు బాబుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని పలుమార్లు హెచ్చరించడమే కాకుండా కేసులు పెడుతున్నా ఇవేమి పట్టవన్నట్టుగా కొందరు మందుబాబులు ప్రవర్తిస్తున్నారు. వీరి ఆగడాల వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో తాజాగా ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. కొందరు మందు బాబులు రాత్రి వేళల్లో మద్యం సేవించి ఖాళీ సీసాలను పంచాయతీ […]

Update: 2021-12-14 04:34 GMT

దిశ, కొడిమ్యాల : మందు బాబుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని పలుమార్లు హెచ్చరించడమే కాకుండా కేసులు పెడుతున్నా ఇవేమి పట్టవన్నట్టుగా కొందరు మందుబాబులు ప్రవర్తిస్తున్నారు. వీరి ఆగడాల వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో తాజాగా ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. కొందరు మందు బాబులు రాత్రి వేళల్లో మద్యం సేవించి ఖాళీ సీసాలను పంచాయతీ కార్యాలయ ఆవరణలోనే పడవేశారు. బీరు బాటిళ్లను చూసిన గ్రామస్తులు మండిపడుతున్నారు. వీటిని ఇక్కడ ఎవరు పడవేశారో గుర్తించి వీలైనంత త్వరగా పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News