ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. ఒకరు మృతి

దిశ, వెబ్ డెస్క్: తేనెటీగల దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో సోమవారం ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో కుమ్మరవేణి సత్తయ్య అనే కూలి మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-06-15 02:31 GMT

Tags:    

Similar News