ఎకానమీ మోడ్‌లో.. బీసీసీఐ

ఆర్థిక మాంద్యంతో పాటు ఈ సారి ఐపీఎల్ రాబడి కూడా తగ్గిపోనున్న నేపథ్యంలో బీసీసీఐ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఇకపై దుబారాను తగ్గించాలని నిర్ణయించింది. ఇకపై జూనియర్, సీనియర్ సెలెక్టర్లకు మాత్రమే విమానాల్లో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణానికి అనుమతించనుంది. దేశీయ ప్రయాణాలకు మిగతా సెలక్టెర్లకు ఎకానమీ టికెట్లు మాత్రమే సమకూర్చనుంది. ఇక కమిటీ సభ్యులందరికీ ఏడు గంటలకు పైగా ప్రయాణానికి మాత్రమే బిజినెస్ క్లాస్ టికెట్లు కల్పించనుంది. అంటే […]

Update: 2020-03-18 07:00 GMT

ఆర్థిక మాంద్యంతో పాటు ఈ సారి ఐపీఎల్ రాబడి కూడా తగ్గిపోనున్న నేపథ్యంలో బీసీసీఐ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఇకపై దుబారాను తగ్గించాలని నిర్ణయించింది. ఇకపై జూనియర్, సీనియర్ సెలెక్టర్లకు మాత్రమే విమానాల్లో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణానికి అనుమతించనుంది. దేశీయ ప్రయాణాలకు మిగతా సెలక్టెర్లకు ఎకానమీ టికెట్లు మాత్రమే సమకూర్చనుంది. ఇక కమిటీ సభ్యులందరికీ ఏడు గంటలకు పైగా ప్రయాణానికి మాత్రమే బిజినెస్ క్లాస్ టికెట్లు కల్పించనుంది. అంటే ఇకపై సీనియర్ జట్టు చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి, జూనియర్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఆశీష్ కపూర్‌లకు మాత్రమే బీసీసీఐ బిజినెస్ క్లాస్ టికెట్లు ఇవ్వనుంది. 2013 వరకు సెలెక్షన్ కమిటీ సభ్యులందరూ ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించే వాళ్లు. కాగా, ఒకే విమానంలో ఆటగాళ్లు బిజినెస్ క్లాస్‌లో.. సెలెక్టర్లు ఎకానమీలో ప్రయాణించడం పట్ల ఫిర్యాదులు అందాయి. దీంతో అప్పటి నుంచి అందరికీ బిజినెస్ క్లాస్‌కు అనుమతించారు. ఇప్పుడు దానికి కూడా కోత పెట్టారు.

tags : BCCI, Business class tickets, Economy class, Flight Journey, Chief selector

Tags:    

Similar News