ధరణికి బ్యాంకర్ల అంగీకారం

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్​ద్వారా చేపట్టిన సాయం, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విధానానికి బ్యాంకర్లు అంగీకారం తెలిపారు. బీఆర్కే భవన్‌లో మార్ట్​గేజ్ మాడ్యూల్ గురించి బుధవారం సీఎస్ సోమేష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆస్తుల లావాదేవీలలో నెలకొన్న సందేహాలను సీఎస్ నివృత్తి చేశారు. పారదర్శకతను ప్రశంసించిన బ్యాంకర్లు ప్రభుత్వం, స్టాంప్స్ అండ్​రిజిస్ట్రేషన్ల శాఖకు ధరణి విధానాలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ రామకృష్ణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, […]

Update: 2020-12-16 11:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్​ద్వారా చేపట్టిన సాయం, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విధానానికి బ్యాంకర్లు అంగీకారం తెలిపారు. బీఆర్కే భవన్‌లో మార్ట్​గేజ్ మాడ్యూల్ గురించి బుధవారం సీఎస్ సోమేష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆస్తుల లావాదేవీలలో నెలకొన్న సందేహాలను సీఎస్ నివృత్తి చేశారు. పారదర్శకతను ప్రశంసించిన బ్యాంకర్లు ప్రభుత్వం, స్టాంప్స్ అండ్​రిజిస్ట్రేషన్ల శాఖకు ధరణి విధానాలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ రామకృష్ణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర రావు, ఎస్ఎల్​బీసీ జీఎం కృష్ణన్​శర్మ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్సీ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News