అభిమాని పాడె మోసిన బండి సంజయ్..

దిశ, వెబ్‌డెస్క్ : సిద్దిపేటలో ఎంపీ బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని గంగల శ్రీనివాస్ అనే కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను గత రాత్రి తుదిశ్వాస విడిచాడు. శ్రీనివాస్ అంతక్రియలను శుక్రవారం నిర్వహించగా అందులో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండిసంజయ్ పాల్గొన్నారు. అంతేకాకుండా తన అభిమాని పాడెను స్వయంగా మోశారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ.. యువత చిన్న విషయాలకే […]

Update: 2020-11-06 03:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సిద్దిపేటలో ఎంపీ బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని గంగల శ్రీనివాస్ అనే కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను గత రాత్రి తుదిశ్వాస విడిచాడు. శ్రీనివాస్ అంతక్రియలను శుక్రవారం నిర్వహించగా అందులో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండిసంజయ్ పాల్గొన్నారు.

అంతేకాకుండా తన అభిమాని పాడెను స్వయంగా మోశారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ.. యువత చిన్న విషయాలకే ఉద్వేగానికి గురై ఆత్మహత్యలకు పాల్పడరాదని, అలా చేయడం వలన మీ బంగారు భవిష్యత్తును కోల్పోరాదని సూచించారు.

Tags:    

Similar News