నా సంతకం ఫోర్జరీ చేశారు: బండి సంజయ్

దిశ, తెలంగాణ బ్యూరో : వరద సాయం నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతుంది. ఆ లేఖను తాను రాయలేదని, తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేయడం ద్వారా లేఖను సృష్టించి ఎన్నికల కమిషన్‌కు పంపించారని, తద్వారా మా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని దీనిపై […]

Update: 2020-11-18 12:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వరద సాయం నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతుంది. ఆ లేఖను తాను రాయలేదని, తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేయడం ద్వారా లేఖను సృష్టించి ఎన్నికల కమిషన్‌కు పంపించారని, తద్వారా మా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదు కాపీని రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం మంత్రికి పంపించారు.

Tags:    

Similar News