ఆ ప్రతిమలు వాడకండి -మంత్రి బాలినేని 

దిశ, ఏపీ బ్యూరో: ప్రజలందరూ మట్టి గణపతిని మాత్రమే పూజించాలని రాష్ట్ర విద్యుత్ అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం వినాయకచవితి పండుగ వాతావరణం పై నిబంధనలు విధించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే వినాయకుని ప్రతిమ పెట్టుకొని పూజించుకోవాలని కోరారు. పర్యావరణాన్ని రక్షించడం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. భావి తరాలవారికి మంచి ప్రకృతిని అందించాలని, అందుకోసమే పర్యావరణం కలుషితం కాకుండా […]

Update: 2020-08-21 06:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రజలందరూ మట్టి గణపతిని మాత్రమే పూజించాలని రాష్ట్ర విద్యుత్ అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం వినాయకచవితి పండుగ వాతావరణం పై నిబంధనలు విధించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే వినాయకుని ప్రతిమ పెట్టుకొని పూజించుకోవాలని కోరారు.

పర్యావరణాన్ని రక్షించడం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. భావి తరాలవారికి మంచి ప్రకృతిని అందించాలని, అందుకోసమే పర్యావరణం కలుషితం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక ప్రతిమలను వినియోగించవద్దని సూచించారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News