భద్రాచలం ఏజెన్సీలో బాలసాని పర్యటన
దిశ, భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం భద్రాచలం ఏజెన్సీలో పర్యటించారు. చర్ల మండల పర్యటనకు విచ్చేసిన ఆయనకు టీఆర్ఎస్ చర్ల మండల అధ్యక్షుడు సోయం రాజారావు, ప్రధాన కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్‌ల నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఐఐటీ సీటు సాధించిన మామిడిగూడెం గ్రామంలోని నిరుపేద గిరిజన విద్యార్థి కారం శ్రీలత ఇంటికి వెళ్ళి శాలువా కప్పి అభినందించారు. చదువులో రాణిస్తున్న శ్రీలతని బాగా చదివించాలని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. […]
దిశ, భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం భద్రాచలం ఏజెన్సీలో పర్యటించారు. చర్ల మండల పర్యటనకు విచ్చేసిన ఆయనకు టీఆర్ఎస్ చర్ల మండల అధ్యక్షుడు సోయం రాజారావు, ప్రధాన కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్‌ల నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఐఐటీ సీటు సాధించిన మామిడిగూడెం గ్రామంలోని నిరుపేద గిరిజన విద్యార్థి కారం శ్రీలత ఇంటికి వెళ్ళి శాలువా కప్పి అభినందించారు. చదువులో రాణిస్తున్న శ్రీలతని బాగా చదివించాలని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. శ్రీలత చదువుకి ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని భరోసా కల్పించారు. టీఆర్ఎస్ కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్ రూ.5 వేలు, రిటైర్డ్ టీచర్, మండల నాయకుడు దొడ్డి తాతారావు వెయ్యి రూపాయలు కలిపి రూ.6 వేలు ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేశారు.
అక్కడి నుంచి కాన్వాయ్‌గా చర్లకు చేరుకొని ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ చర్ల మండల మాజీ అధ్యక్షుడు పరుచూరి రమేశ్‌బాబు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను, రమేశ్‌బాబు తండ్రి పరుచూరి సూర్యప్రకాశరావు, సోదరుడు, చర్ల పీఏసీఎస్ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరుచూరి రవికుమార్, మరో సోదరుడు, జర్నలిస్టు రవీంద్రలను పరామర్శించారు. తదుపరి ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన పార్టీ కార్యకర్త గడ్డం నాగరాజు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాలసాని పర్యటనలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, చర్ల ఏఎంసీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, భద్రాచలం మండల అధ్యక్ష, కార్యదర్శిలు అరికెల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి చర్ల టౌన్ అధ్యక్షుడు కాకి అనిల్, మీడియా ఇన్‌చార్జి పంజా రాజు, ఎస్‌సి సెల్ మండల అధ్యక్షుడు తోటమల్ల వరప్రసాద్, ఎస్‌టి సెల్ మండల అధ్యక్షుడు కాపుల నాగరాజు, మండల నాయకుడు దొడ్డి తాతారావు, కొటేరు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.