దేశీయ టూ-వీలర్ ధరలూ పెరిగాయి!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఇటీవల కార్ల ధరలు పెంచుతున్నట్టు దాదాపు అన్ని కంపెనీలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే టూ-వీలర్ వాహన కంపెనీలు సైతం ధరల పెంపును ప్రకటించాయి. దేశీయ ప్రముఖ దిగ్గజ టూ-వీలర్ వాహన తయారీ సంస్థలైన టీవీఎస్, బజాజ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచనున్నట్టు తెలిపాయి. బజాజ్ ఆటోతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు అన్ని మోటర్‌సైకిళ్ల ధరలను పెంచాలని నిర్ణయించగా, టీవీఎస్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ విభాగంలోని అపాచీ బ్రాండ్ బైక్ […]

Update: 2021-01-13 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఇటీవల కార్ల ధరలు పెంచుతున్నట్టు దాదాపు అన్ని కంపెనీలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే టూ-వీలర్ వాహన కంపెనీలు సైతం ధరల పెంపును ప్రకటించాయి. దేశీయ ప్రముఖ దిగ్గజ టూ-వీలర్ వాహన తయారీ సంస్థలైన టీవీఎస్, బజాజ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచనున్నట్టు తెలిపాయి. బజాజ్ ఆటోతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు అన్ని మోటర్‌సైకిళ్ల ధరలను పెంచాలని నిర్ణయించగా, టీవీఎస్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ విభాగంలోని అపాచీ బ్రాండ్ బైక్ ధరలను పెంచనుంది. పెంచిన ధరలు ప్రస్తుత ఏడాది జనవరి నుంచి తయారైన వాటికి వర్తిస్తాయని కంపెనీలు పేర్కొన్నాయి.

బజాజ్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ బైక్ అవెంజర్ క్రూజర్ 220 ధరపై రూ. 3,500 పైగా పెంచింది. డొమినార్ 250తో పాటు డొమినార్ 400 ధరలను రూ. 3,500 వరకు పెంచింది. పల్సర్ 220ఎఫ్‌పై రూ. 3,500 వరకు పెంచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన క్లాసిక్ 350[ఐ రూ. 2 వేలు, బుల్లెట్ శ్రేణి బైకులపై రూ. 2 వేలు, మీటియర్ 350పై రూ. 3 వేల వరకు పెంచనున్నట్టు తెలిపింది. టీవీస్ అపాచీ ఆర్ఆర్ 310పై రూ. 3 వేల వరకు పెంచాలని నిర్ణయించింది.

Tags:    

Similar News