రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు

దిశ, న్యూస్‌బ్యూరో: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. రంగారెడ్డి జిల్లా మియాఖాన్‌గూడలో కేటీఆర్ ఫాంహౌజ్ పైకి రహాస్యంగా డ్రోన్ కెమెరా పంపి చిత్రీకరించిన కేసులో రేవంత్‌‌‌ను ఈనెల 5న నార్సింగి పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి చంచల్‌గూడ జైల్లో ఉంటున్న ఆయనకు ఇవాళ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవంత్‌రెడ్డి వ్యవహారంపై కొద్దిరోజుల క్రితం లోక్‌సభలో కూడా చర్చ జరిగింది. […]

Update: 2020-03-18 01:36 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. రంగారెడ్డి జిల్లా మియాఖాన్‌గూడలో కేటీఆర్ ఫాంహౌజ్ పైకి రహాస్యంగా డ్రోన్ కెమెరా పంపి చిత్రీకరించిన కేసులో రేవంత్‌‌‌ను ఈనెల 5న నార్సింగి పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి చంచల్‌గూడ జైల్లో ఉంటున్న ఆయనకు ఇవాళ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవంత్‌రెడ్డి వ్యవహారంపై కొద్దిరోజుల క్రితం లోక్‌సభలో కూడా చర్చ జరిగింది. ఈ విషయంపై రాజ్యసభ ఎంపీ గులాంనబీ ఆజాద్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రమంత్రులకు సైతం విజ్ఞప్తి చేశారు. చిన్న కేసులో పార్లమెంట్ మెంబర్‌ను అరెస్ట్ చేసి కేసీఆర్ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Tags: Revanth Reddy, Bail Granted, KTR Farmhouse, Ragareddy, Charlapalli Jail, Lok Sabha, Ghulam Nabi Azad, Uttam and Amit Shah

Tags:    

Similar News