వైరల్ అవుతున్న అయోధ్య విజువల్స్.. ఫస్ట్ ఫేజ్ ఎలా ఉందంటే!

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామజన్మభూమిలో రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి సంబంధించి లేటెస్ట్ విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సుమారు వెయ్యి కోట్లకు పైగా నిధులతో నిర్మిస్తున్న ఈ మందిరం నిర్మాణం చరిత్రలో నిలిచిపోనుందని ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసినట్టు వెల్లడించారు. Latest visuals of foundation work at Ayodhya's Ram Temple First phase has been […]

Update: 2021-09-16 22:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామజన్మభూమిలో రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి సంబంధించి లేటెస్ట్ విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సుమారు వెయ్యి కోట్లకు పైగా నిధులతో నిర్మిస్తున్న ఈ మందిరం నిర్మాణం చరిత్రలో నిలిచిపోనుందని ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసినట్టు వెల్లడించారు.

ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి పునాది పనులు పూర్తయ్యాయి. దీని విజువల్స్‌ గురువారం విడుదలయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపాట్ రాయ్ మాట్లాడుతూ.. ‘మొదటి దశ పూర్తయింది. మేము రాళ్లతో తయారు చేసిన మరొక పొరను ఏర్పాటు చేయనున్నాము. ఈ కాంక్రీట్ బేస్ మీద కర్ణాటక గ్రానైట్ మరియు మీర్జాపూర్ ఇసుకరాయి’తో నిర్మాణం జరగనుంది. రామమందిరానికి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తామని చంపాట్ రాయ్ తెలిపారు.

Tags:    

Similar News