అలాంటి వారికి చాన్స్ ఇవ్వకూడదు : అయేషా టకియా

‘సూపర్’ సినిమాలో నాగార్జున సరసన మెరిసిన బాలీవుడ్ హీరోయిన్ అయేషా టకియా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య పై ఆవేదన వ్యక్తం చేసింది. తను కూడా సుశాంత్ మాదిరిగా వర్క్ ప్లేస్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ట్రోలింగ్‌లు, బెదిరింపులు ఎదురైతే వాటి నుంచి బయటకు వచ్చి ఏం జరుగుతుందో మాట్లాడాలని కోరింది. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా, పనికిరాని వారిగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.. అంటే మీలో ఏదో గొప్ప, ప్రత్యేకమైన క్వాలిటీ ఉందని అర్ధం చేసుకోవాలంది. […]

Update: 2020-06-18 04:02 GMT

‘సూపర్’ సినిమాలో నాగార్జున సరసన మెరిసిన బాలీవుడ్ హీరోయిన్ అయేషా టకియా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య పై ఆవేదన వ్యక్తం చేసింది. తను కూడా సుశాంత్ మాదిరిగా వర్క్ ప్లేస్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ట్రోలింగ్‌లు, బెదిరింపులు ఎదురైతే వాటి నుంచి బయటకు వచ్చి ఏం జరుగుతుందో మాట్లాడాలని కోరింది. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా, పనికిరాని వారిగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.. అంటే మీలో ఏదో గొప్ప, ప్రత్యేకమైన క్వాలిటీ ఉందని అర్ధం చేసుకోవాలంది. అక్కడే ఉండేందుకు, మీకు కావాల్సింది పొందేందుకు పోరాడాలని కోరింది. ప్రకాశవంతమైన మీరు అలాంటి వారు గెలిచేందుకు చాన్స్ ఇవ్వకూడదని చెప్పింది. మిమ్మల్ని కిందకు లాగేందుకు, అణగదొక్కాలని ప్రయత్నిస్తున్న స్వార్థ పూరితమైన వ్యక్తుల గురించి డైరీలో నోట్ చేయండి లేదా ఆన్‌లైన్‌లో వారి గురించి మాట్లాడాలని కోరింది.

ఇదంతా చెప్పడానికి సులభంగా ఉంటుంది.. చేయడం చాలా కష్టమని, కానీ తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్తోంది అయేషా. మన భవిష్యత్ తరాల మంచి కోసం, శ్రేయస్సు కోసం.. ఈ ప్రపంచాన్ని దయతో నిండి ఉండేలా మార్చుకుందాం అంటోంది. మన పిల్లల రక్షణ కోసం ప్రేమ, దయ అనేది మన ప్రపంచాన్ని లీడ్ చేసేలా మలుచుకుందాం అంటుంది. దయచేసి ప్రతీ ఒక్కరితో ప్రేమగా మాట్లాడండి.. దయగా ఉండండి.. వాళ్లు ఎంత బాధలో ఉన్నారో మనకు తెలియదు కదా అని చెప్పింది అయేషా.

Tags:    

Similar News