Child Marriage : బాల్య వివాహం అడ్డగింత.. పేరెంట్స్‌కు వార్నింగ్

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలో 17 ఏళ్ల యువతికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు యత్నించారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎస్సై చల్ల అరుణ, రెవిన్యూ సిబ్బంది, ఆరోగ్య సిబ్బందిని వెంటబెట్టుకుని యువతి ఇంటికి వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం యువతి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండాకే వివాహం చేయాలని సూచించారు. మేజర్ కాకుండానే పెళ్లి చేసేందుకు యత్నిస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు […]

Update: 2021-05-27 09:01 GMT

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలో 17 ఏళ్ల యువతికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు యత్నించారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎస్సై చల్ల అరుణ, రెవిన్యూ సిబ్బంది, ఆరోగ్య సిబ్బందిని వెంటబెట్టుకుని యువతి ఇంటికి వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు.

అనంతరం యువతి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండాకే వివాహం చేయాలని సూచించారు. మేజర్ కాకుండానే పెళ్లి చేసేందుకు యత్నిస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహం చేయడం వల్ల జరిగే అనార్థాలను తల్లిదండ్రులకు వివరించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News