టీడీపీపై స్పీకర్ ఫైర్.. ఎందుకో చెప్పారు

దిశ, అమరావతి: మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా లేవని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108,104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క […]

Update: 2020-07-02 00:35 GMT

దిశ, అమరావతి: మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా లేవని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు. 108,104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకు వేస్తున్నారని తమినేని సీతారాం కొనియాడారు.

Tags:    

Similar News