'ఆర్య2’ ట్రైలర్ : గ్యాంగ్స్టర్గా అదరగొట్టిన సుష్మిత సేన్
దిశ, సినిమా: ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న హిందీ వెబ్ సిరీస్ ‘ఆర్య 2’ ట్రైలర్ వచ్చేసింది. కాగా ఈ రోజు విడుదలైన ట్రైలర్లో సుష్మితా సేన్ పూర్తిగా గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నట్లు అర్థమౌతోంది. క్రైమ్ ప్రపంచం నుంచి తన పిల్లలను, కుటుంబాన్ని రక్షించాలనుకునే ఓ తల్లి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుండగా.. సుష్మిత ‘ఆర్య సరీన్’గా నటిస్తుంది. ఇక సిరీస్లో సికిందర్ ఖేర్, వికాస్ కుమార్, మాయో సరావ్, అంకుర్ భాటియా, అరాష్ ఖురానా, దిల్నాజ్ ఇరానీలు కూడా […]
దిశ, సినిమా: ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న హిందీ వెబ్ సిరీస్ ‘ఆర్య 2’ ట్రైలర్ వచ్చేసింది. కాగా ఈ రోజు విడుదలైన ట్రైలర్లో సుష్మితా సేన్ పూర్తిగా గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నట్లు అర్థమౌతోంది. క్రైమ్ ప్రపంచం నుంచి తన పిల్లలను, కుటుంబాన్ని రక్షించాలనుకునే ఓ తల్లి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుండగా.. సుష్మిత ‘ఆర్య సరీన్’గా నటిస్తుంది. ఇక సిరీస్లో సికిందర్ ఖేర్, వికాస్ కుమార్, మాయో సరావ్, అంకుర్ భాటియా, అరాష్ ఖురానా, దిల్నాజ్ ఇరానీలు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఇటీవల తన పాత్ర గురించి మాట్లాడిన సుష్మిత.. ‘ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2021కి నామినేట్ అయిన తర్వాత మేము రెండవ సీజన్ కోసం ముందే చాలా పక్కాగా సిద్ధం అయ్యాము. రెండవ సీజన్లో ఆర్య బలమైన మహిళగా మాత్రమే కాకుండా యోధురాలిగా కూడా కనిపిస్తుంది. ఈ కొత్త అధ్యాయంలో ఆర్య పాత్ర పోషించడం ద్వారా మరింత నేర్చుకున్నాను. ఆర్యగా నా కొత్త రూపాన్ని ప్రేక్షకులు ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అని తెలిపింది. ఇక ఈ ‘ఆర్య 2’ డిసెంబర్ 10న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.