చదువు ముసుగులో వ్యభిచారం.. ఏకంగా ఇంటికే రప్పించుకొంటూ

దిశ, వెబ్‌డెస్క్: వారు విదేశీయులు.. చదువు కోసం ఇండియా వచ్చారు. చదువు పేరు  చెప్పి హైదరాబాద్ లో మాకాం వేశారు. భార్యాభర్తలమని నమ్మించి ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్నది మొదలు ఆ ఇంటికి మగాళ్లు రావడం, పోవడమే జరుగుతుంది.  చదువుకోవడానికి వచ్చిన వారికి, ఆ ఇంటికి వచ్చిపోతున్న మగాళ్లకు సంబంధం ఏంటి అంటే.. స్టడీ వీసాతో ఇండియా కు వచ్చిన ఆ జంట చదువు ముసుగులో వ్యభిచారం దందా మొదలుపెట్టారు. నేరుగా మగాళ్లను ఇంటికే పిలిపించుకొని […]

Update: 2021-06-29 02:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: వారు విదేశీయులు.. చదువు కోసం ఇండియా వచ్చారు. చదువు పేరు చెప్పి హైదరాబాద్ లో మాకాం వేశారు. భార్యాభర్తలమని నమ్మించి ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్నది మొదలు ఆ ఇంటికి మగాళ్లు రావడం, పోవడమే జరుగుతుంది. చదువుకోవడానికి వచ్చిన వారికి, ఆ ఇంటికి వచ్చిపోతున్న మగాళ్లకు సంబంధం ఏంటి అంటే.. స్టడీ వీసాతో ఇండియా కు వచ్చిన ఆ జంట చదువు ముసుగులో వ్యభిచారం దందా మొదలుపెట్టారు. నేరుగా మగాళ్లను ఇంటికే పిలిపించుకొని వ్యాపారం సాగిస్తున్న వారిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే..

టాంజానియాకు చెందిన డయానా (24), కాబాంగిలా వారెన్ (24) స్టడీ వీసాపై గతేడాది జనవరిలో హైదరాబాద్ వచ్చారు. అప్పటినుంచి తార్నాకలో ఉంటున్న ఈ జంట బార్యాభర్తలమని చెప్పి ఇటీవలే నేరెడ్‌మెట్‌కు మాకాం మార్చారు. ఇక ఈ నేపథ్యంలోనే ‘మీట్ 24’ యాప్ లో రిజిస్టర్ చేసుకున్న డయానా తన వ్యాపారాన్ని మొదలుపెట్టింది. కస్టమర్స్ ని ఇంటికే రమ్మని పిలిపించుకునేది. రోజుకు ఎంతోమంది మగవాళ్లు ఇంటికి రావడం, పోవడం గమనించిన చుట్టుపక్కలవారికి అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ, నేరెడ్‌మెట్‌ పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పాస్‌పోర్టులు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ వారు అక్రమంగా ఇక్కడే ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags:    

Similar News