రైతుబంధు సాయానికి దరఖాస్తు చేసుకోండి

దిశ, తాండూరు: కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పెద్దేముల్ ఏఓ నజీరోద్దీన్ అన్నారు. సోమవారం పలువురు రైతుల నుంచి రైతుబంధు పథకం కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. పెద్దేముల్ మండల వ్యాప్తంగా 11,371మంది రైతులకు రైతుబంధు సాయం వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నేటి నుంచి రైతుబంధు సాయం జమ చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేయనివారు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు […]

Update: 2021-06-14 06:41 GMT

దిశ, తాండూరు: కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పెద్దేముల్ ఏఓ నజీరోద్దీన్ అన్నారు. సోమవారం పలువురు రైతుల నుంచి రైతుబంధు పథకం కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. పెద్దేముల్ మండల వ్యాప్తంగా 11,371మంది రైతులకు రైతుబంధు సాయం వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నేటి నుంచి రైతుబంధు సాయం జమ చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేయనివారు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్ తీసుకొచ్చి రెండు రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా మొత్తం 55 క్వింటాళ్ల మినీ కిట్ల కంది విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో స్వాతి తదితరులు ఉన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News