10లోపు సీట్లకు దరఖాస్తు చేసుకోవాలి

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ ఫేజ్ 1,2లో వెబ్ ఆప్షన్లు ఇచ్చినా సీటు రాని విద్యార్థులు ఈనెల 10లోపు మరిన్ని వెబ్ ఆప్షన్లు ఇచ్చి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని దోస్త్ కన్వీనర్ లింబాద్రి సూచించారు. ఫేజ్ -1లో సీటు కేటాయించినా… సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేకపోయినా విద్యార్థులు మూడో ఫేజ్ ముగిసే లోపు రెండోసారి దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 9 వరకు మూడో ఫేజ్ దరఖాస్తులు చేసకోవచ్చని, ఇప్పటి వరకు 57,507 మంది విద్యార్థులు […]

Update: 2020-10-07 11:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ ఫేజ్ 1,2లో వెబ్ ఆప్షన్లు ఇచ్చినా సీటు రాని విద్యార్థులు ఈనెల 10లోపు మరిన్ని వెబ్ ఆప్షన్లు ఇచ్చి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని దోస్త్ కన్వీనర్ లింబాద్రి సూచించారు. ఫేజ్ -1లో సీటు కేటాయించినా… సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేకపోయినా విద్యార్థులు మూడో ఫేజ్ ముగిసే లోపు రెండోసారి దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 9 వరకు మూడో ఫేజ్ దరఖాస్తులు చేసకోవచ్చని, ఇప్పటి వరకు 57,507 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పూర్తి చేశారని తెలిపారు. దోస్త్ 1, 2 ఫేజ్‌ల్లో కలిపి 1,53,547 మంది విద్యార్థుల సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా ముగిసినట్టు తెలిపారు.

Tags:    

Similar News