అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా

దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వివాదంపై నిర్వహించాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. బుధవారం ఇరురాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేనని, ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాలున్నాయని కేంద్రానికి సూచించారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి చేసిన వినతి ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు […]

Update: 2020-08-05 09:07 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వివాదంపై నిర్వహించాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. బుధవారం ఇరురాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేనని, ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాలున్నాయని కేంద్రానికి సూచించారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి చేసిన వినతి ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాలకు లేఖ పంపారు. అపెక్స్ కౌన్సిల్ నిర్వహించే తేదీని త్వరలోనే తెలుపుతామని లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News