మహిళలకు గుడ్ న్యూస్.. పండుగ పూట అకౌంట్‌లోకి డబ్బులు

దిశ, వెబ్‌డెస్క్ : డ్వాక్రా మహిళలకు జగన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. మహిళలకు ఆర్థిక చేయుతనిచ్చేందుకు జగన్ సర్కార్ వైఎస్ ఆర్ ఆసరా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ఆడబిడ్డలందరికి ఆసరా పథకం రెండో విడత మొత్తాన్ని ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్‌లో సభ్యులుగా ఉన్న మహిళల ఖాతాలో వేయబోతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 7.92 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్ల రూపాయలు పంపిణీ కానున్నాయి. […]

Update: 2021-10-06 22:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : డ్వాక్రా మహిళలకు జగన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. మహిళలకు ఆర్థిక చేయుతనిచ్చేందుకు జగన్ సర్కార్ వైఎస్ ఆర్ ఆసరా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ఆడబిడ్డలందరికి ఆసరా పథకం రెండో విడత మొత్తాన్ని ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్‌లో సభ్యులుగా ఉన్న మహిళల ఖాతాలో వేయబోతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 7.92 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్ల రూపాయలు పంపిణీ కానున్నాయి. ఇక ఈ పథకం డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు వినియోగించుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీకారం చుట్టనున్నారు.

Tags:    

Similar News