‘కరోనా’పై స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని, అలాంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ను రాష్ట్ర ప్రజలెవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇంతవరకూ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని, రోజూ ఆరోగ్యశాఖ మంత్రి, మెడికల్ కమిషనర్, అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారని, స్పెషల్ బులిటెన్ కూడా విడుదల చేస్తున్నారని సవాంగ్ పేర్కొన్నారు. దుష్ప్రచారం చేస్తున్నవారిపై […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని, అలాంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ను రాష్ట్ర ప్రజలెవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇంతవరకూ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని, రోజూ ఆరోగ్యశాఖ మంత్రి, మెడికల్ కమిషనర్, అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారని, స్పెషల్ బులిటెన్ కూడా విడుదల చేస్తున్నారని సవాంగ్ పేర్కొన్నారు. దుష్ప్రచారం చేస్తున్నవారిపై కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు.
tags : ap dgp, gautam sawang warns, corona, social media