స్పందించకుంటే.. ఇళ్లల్లోకి తీసుకెళ్తాం

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఉన్న కోపం.. ప్రజలపై చూపడం సరికాదని తెలిపారు. వెంటనే లబ్దిదారులకు టిడ్కో గృహాలను అందజేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే నవంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ రిలే దీక్షలు నిర్వహిస్తుందన్నారు. నవంబర్ 16 నుంచి లబ్దిదారులను నేరుగా ఇళ్లల్లోకి తీసుకెళ్తామన్నారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నికలకు వెళ్దామని, ఈ ఎన్నికల్లో జగన్‌కు […]

Update: 2020-10-23 02:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఉన్న కోపం.. ప్రజలపై చూపడం సరికాదని తెలిపారు. వెంటనే లబ్దిదారులకు టిడ్కో గృహాలను అందజేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే నవంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ రిలే దీక్షలు నిర్వహిస్తుందన్నారు. నవంబర్ 16 నుంచి లబ్దిదారులను నేరుగా ఇళ్లల్లోకి తీసుకెళ్తామన్నారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నికలకు వెళ్దామని, ఈ ఎన్నికల్లో జగన్‌కు ఒక్క సీటు ఎక్కువ వచ్చిన అమరావతిపై నోరెత్తబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News