చంద్రబాబుకు నోటీసులు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఉదయం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు నోటీసులివ్వడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దురుద్దేశంతోనే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించడాన్ని ఖండిచారు. సీఐడీ నోటీసులను కక్ష సాధింపు అనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. […]

Update: 2021-03-16 06:45 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఉదయం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు నోటీసులివ్వడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దురుద్దేశంతోనే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించడాన్ని ఖండిచారు. సీఐడీ నోటీసులను కక్ష సాధింపు అనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. గతంలో తమపై టీడీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడలేదా..? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వచ్చినప్పుడు బ్లాక్ బెలూన్స్, ప్లకార్డులు ప్రదర్శించలేదా అని నిలదీశారు. కేంద్ర మంత్రి అమిత్‌షా.. తిరుపతి పర్యటనలో రాళ్లదాడి చేసిన విషయాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు.

Tags:    

Similar News