వికేంద్రీకరణ బిల్లుపై చర్చించాం: తమ్మినేని

దిశ, వెబ్‌డెస్క్: వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో సమారు 11 గంటల పాటు చర్చ జరిగిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులకు 2 గంటల 17 నిమిషాల సమయం ఇచ్చామని వెల్లడించారు. అయినా, ఈ బిల్లుపై చర్చ జరగలేదని టీడీపీ నాయకులు మాట్లాడటం సబబు కాదన్నారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దు అంశం అసెంబ్లీలో చర్చ జగరలేదని విమర్శించడం సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సెలెక్ట్ […]

Update: 2020-08-07 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో సమారు 11 గంటల పాటు చర్చ జరిగిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులకు 2 గంటల 17 నిమిషాల సమయం ఇచ్చామని వెల్లడించారు. అయినా, ఈ బిల్లుపై చర్చ జరగలేదని టీడీపీ నాయకులు మాట్లాడటం సబబు కాదన్నారు.

వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దు అంశం అసెంబ్లీలో చర్చ జగరలేదని విమర్శించడం సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడు బిల్లు పెండింగ్‌లో ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం వీల్లేదని.. 1997లోనే యనమల రూలింగ్ ఇచ్చారని సీతారాం గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు సభ తీసుకునే నిర్ణయాలపై కోర్టులకు వెళ్తారా అంటూ స్పీకర్ తమ్మినేని నిలదీశారు.

Tags:    

Similar News