సీఎం జగన్‌ తలచుకుంటే ఏదైనా సాధ్యమే

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసాధ్యం అనుకున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అదే రీతిలో తమ న్యాయపరమైన సమస్యలపైనా సీఎం దృష్టి సారించాల‌ని కోరారు. సీఎం జ‌గ‌న్ త‌ల‌చుకుంటే ఏదైనా సాధ్యమ‌ని చెప్పుకొచ్చారు. సీపీఎస్ ర‌ద్దు విష‌యంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే కేంద్ర ఉద్యోగ సంఘాల‌తో క‌ల‌సి పోరాటం చేస్తామని […]

Update: 2021-12-15 05:37 GMT

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసాధ్యం అనుకున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అదే రీతిలో తమ న్యాయపరమైన సమస్యలపైనా సీఎం దృష్టి సారించాల‌ని కోరారు. సీఎం జ‌గ‌న్ త‌ల‌చుకుంటే ఏదైనా సాధ్యమ‌ని చెప్పుకొచ్చారు.

సీపీఎస్ ర‌ద్దు విష‌యంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే కేంద్ర ఉద్యోగ సంఘాల‌తో క‌ల‌సి పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఉద్యోగస్తుల సమస్యలపై పోరాడటంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ఉద్యోగ సంఘాల‌ను కూడా కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పారు. సీపీఎస్ విష‌యంలో ప్రభుత్వ సలహాదారు స‌జ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. నాడు సీఎం జగన్‌కు అవగాహన లేకుండా మాట్లాడారంటూ స‌జ్జల వ్యాఖ్యానించడం బాధించిందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News