గర్ల్‌ ఫ్రెండ్ దెబ్బకు సన్యాసిగా మారాలనుకున్నా..

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ‘అనుపర్ కేర్స్’ పేరుతో పాడ్‌కాస్ట్స్ చేస్తుంటాడు. అయితే ఆయన లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పాడ్‌కాస్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ ఎపిసోడ్‌లో తన వరెస్ట్ డేట్ గురించి వివరించగా వైరల్ అయింది. గర్ల్ ఫ్రెండ్‌తో హోటల్‌కు వెళ్లిన తనకు చాలా చేదు అనుభవం మిగిలిందని చెప్పాడు అనుపమ్. Trailer of my #Podcast! This is the story of my worst date…I had […]

Update: 2020-12-29 09:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ‘అనుపర్ కేర్స్’ పేరుతో పాడ్‌కాస్ట్స్ చేస్తుంటాడు. అయితే ఆయన లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పాడ్‌కాస్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ ఎపిసోడ్‌లో తన వరెస్ట్ డేట్ గురించి వివరించగా వైరల్ అయింది. గర్ల్ ఫ్రెండ్‌తో హోటల్‌కు వెళ్లిన తనకు చాలా చేదు అనుభవం మిగిలిందని చెప్పాడు అనుపమ్.

షేర్వాణి ధరించి పెళ్లి కొడుకు మాదిరిగా రెస్టారెంట్‌ వెళ్లగా.. చిన్న గొడవతో గర్ల్ ఫ్రెండ్ చేసిన రచ్చ మామూలుగా లేదని వివరించాడు. ఒడిలో స్వీట్ కార్న్ సూప్, చొక్కా మీద గ్రేవీ, తల మీద నూడిల్స్ పడేసి వెళ్లిపోయిందని.. ఆ షాక్‌లో ఏం చేయాలో తెలియక బిల్ కూడా కట్టకుండానే హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయానని తెలిపాడు. ఈ ఘటనతో ప్రేమ, పెళ్లి మీద విరక్తి కలిగి.. సన్యాసిగా మారిపోవాలని డిసైడ్ అయ్యానని చెప్పాడు. ఈ పరిస్థితి నుంచి కోలుకునేందుకు ఆశ్రమానికి వెళ్లాల్సి వచ్చిందన్నాడు.

 

Tags:    

Similar News