ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఏపీ వైద్యఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 85,856 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,287 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,68,462కు చేరింది. అదే సమయంలో కరోనాతో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 13,395కు చేరింది. నిన్న ఒక్కరోజు 2,430 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో […]

Update: 2021-08-01 10:25 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఏపీ వైద్యఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 85,856 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,287 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,68,462కు చేరింది. అదే సమయంలో కరోనాతో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 13,395కు చేరింది. నిన్న ఒక్కరోజు 2,430 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.

ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,34,048కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,019 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,46,48,899 సాంపిల్స్‌ని పరీక్షించడం జరిగిందని వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌లో స్పష్టం చేసింది.

 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News