ఈడీ ముందుకు అనీల్ అంబానీ!

దిశ, వెబ్‌డెస్క్: యెస్ బ్యాంకు వ్యవహారంలో అనీల్ అంబానీ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. యెస్ బ్యాంకు ద్వారా తీసుకున్న అప్పుల విషయంలో అనీల్ అంబానీ వాంగ్మూలాన్ని ఈడీ రికార్డు చేసే అవకాశముంది. అనీల్ అంబానీతో పాటు అడాగ్‌ గ్రూప్ సంస్థలోని మరి కొంతమందిని ఈడీ అధికారులు విచారణ జరపనున్నట్టు సమాచారం. యెస్ బ్యాంకు వ్యవస్థాపకుడైన రానాకపూర్‌ను ఇదివరకే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అనీల్ అంబానీకి చెందిన సంస్థలు యెస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు […]

Update: 2020-03-19 05:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: యెస్ బ్యాంకు వ్యవహారంలో అనీల్ అంబానీ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. యెస్ బ్యాంకు ద్వారా తీసుకున్న అప్పుల విషయంలో అనీల్ అంబానీ వాంగ్మూలాన్ని ఈడీ రికార్డు చేసే అవకాశముంది. అనీల్ అంబానీతో పాటు అడాగ్‌ గ్రూప్ సంస్థలోని మరి కొంతమందిని ఈడీ అధికారులు విచారణ జరపనున్నట్టు సమాచారం. యెస్ బ్యాంకు వ్యవస్థాపకుడైన రానాకపూర్‌ను ఇదివరకే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అనీల్ అంబానీకి చెందిన సంస్థలు యెస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయని ఈడీ వెల్లడించింది. యెస్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకున్న ఇతర కంపెనీల ప్రమోటర్లకు కూడా ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ కంపెనీలు యెస్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకున్నారని, ప్రస్తుతం ఇవన్నీ నిరర్ధక ఆస్తులుగా మారాయని, అందుకే యెస్ బ్యాంకు సంక్షోభంలో వెళ్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

tags : Yes Bank, Yes Bank Crisis, Yes Bank Case, Yes Bank Debt, Yes Bank Anil Ambani, Anil Ambani, Yes Bank Rana Kapoor, Yes Bank Reliance Group

Tags:    

Similar News