ఎమ్మెల్సీ ఎన్నికల రీజినల్ కార్యాలయాన్ని ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల రీజినల్ కార్యాలయాన్ని మధురవాడలో వైవీ సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

Update: 2023-02-23 14:13 GMT

దిశ, ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల రీజినల్ కార్యాలయాన్ని మధురవాడలో వైవీ సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ వ్యవహారాలను కీలకంగా తీసుకున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీపరంగా పూర్తి సమాచారం ఈ కార్యాలయం నుంచి తీసుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, పంచకర్ల రమేష్ బాబు, వైసీపీ నాయకురాలు పేడాడ రమణి కుమారి, విశాఖ పట్నం జిల్లా పార్టీఅధ్యక్షులు, విశాఖ నగర మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News