Kadapa: 16వ శతాబ్దం నాటి వినాయకుడి విగ్రహం గుర్తింపు

వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయకుడి విగ్రహం గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు, రచయిత బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు...

Update: 2023-03-06 14:28 GMT

దిశ, కడప: వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయకుడి విగ్రహం గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు, రచయిత బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామానికి చెందిన పుట్టా రామకృష్ణ, శీనుకు చెందిన పశువుల స్థలంలో తూర్పు వైపున ఈ విగ్రహం ఉందని ఆయన పేర్కొన్నారు. 16వ శతాబ్దంలో ఇక్కడ దేదీప్యమానంగా వినాయకుడి ఆలయం వెలుగోందేదని చెప్పారు. కాలక్రమేనా ఈ దేవాలయం శిథిలావస్థకు చేరి వినాయకుడి ప్రతిమ కొంత వరకు మాత్రమే కనబడుతూ వచ్చిందని తెలిపారు.

గుప్తనిధుల కోసం తవ్వడంతో పైకి కనిపించిన విగ్రహం

అయితే గుప్తనిధుల కోసం తవ్వడంతో వినాయకుడి విగ్రహం పూర్తిగా పైకి కనబడుతోందని రమేష్ చెప్పారు. ఈ విగ్రహం ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో ఢమరుకం ఉన్నట్లు రమేష్ వివరించారు. విగ్రహం గురించి స్థానికులు తెలియజేయడంతో ఉత్సలవరం గ్రామానికి వెళ్లి పరిశీలించి విగ్రహం రూపురేఖలు, స్థితిగతుల వివరాలను మైసూర్ పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి తాను తెలిపినట్లు చెప్పారు. అయితే ఆయన విగ్రహాన్ని నిశితంగా పరిశీలించి16వ శతాబ్దం నాటిదని తేల్చి చెప్పారని రమేష్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News