Nara Lokesh: చేనేతలపై వరాల జల్లు.. జీఎస్టీపై కీలక హామీ

నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో వరాల జల్లు కురిస్తున్నారు..

Update: 2023-05-31 12:33 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో వరాలజల్లు కురిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో చేనేత కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేతలకు నారా లోకేశ్ కీలక హామీలిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేతలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే చేనేతపై 5 శాతం జీఎస్టీని ఎత్తివేస్తామన్నారు. అంతేకాదు నేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశపెడతామన్నారు. మగ్గం ఉన్న కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. సీఎం జగన్ పాలనలో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. చేనేత కార్మికుల సమస్యలపై కనీసం సమీక్ష కూడా చేయడంలేదని మండిపడ్డారు. జగన్ పాలనలో చేనేత కార్మికులు బాధితులయ్యారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News