నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు పెడితే క్రిమినల్ కేసు

జిల్లా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మున్సిపల్, పంచాయతీ అధికారుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Update: 2024-02-21 13:22 GMT

దిశ, కడప: జిల్లా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మున్సిపల్, పంచాయతీ అధికారుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఫ్లెక్సీల ఏర్పాటు కు సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందిన చోట మాత్రమే వాటిని నెలకొల్పాలని తెలిపారు. విద్వేషాలు రగిల్చే ఫ్లెక్సీలు ఉండకూడదని ఆయన తెలిపారు. మోటార్ సైకిల్, ఆటో, కార్ ర్యాలీలకు అనుమతి లేదని.. ముందస్తు అనుమతి తో సాధారణ నడక ర్యాలీ లకు మాత్రమే నిబంధనల మేరకు అనుమతించడం జరుగుతుందన్నారు. నిర్వాహకులు పోలీసు అధికారుల నుంచి అనుమతి పొందిన తేదీ, సమయంలోనే వెళ్లాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని తెలిపారు. ర్యాలీలలో ఇతరులకు హాని కలిగించే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డీజే లకు అనుమతి లేదని, లౌడ్ స్పీకర్ లు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఇతరులకు ఇబ్బంది లేకుండా వినియోగించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More..

విజయవాడలో అడ్డగోలుగా వెలుస్తోన్న అక్రమ కట్టడాలు..! 

Tags:    

Similar News